Paddy : నీరు రాక ఎండిపోతున్న వరి పొలాలు..!
సూర్యాపేట జిల్లాపెన్ పహాడ్ మండల పరిధిలోని నూర్జంపేట, మీగ్య తండా, చిన్న సీతారాం తండా, జల్ మాల్ కుంట తండా, మల్కాపురం మరియు వివిధ గ్రామాలలో శ్రీరాంసాగర్ కాలువల ద్వారా కాలేశ్వరం జలాలు వస్తాయని ఆశతో రైతులు వరి పొలాలు నాట్లు వేసి నారు. ప్రస్తుతం కొన్ని పొలాలు పొట్ట దిశలో ఎండిపోతున్నాయి,

ఆదివారం నూర్జంపేట కు చెందిన మహిళ రైతు వాంకుడోత్ గీత మన సాక్షి దినపత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ గతంలో మాదిరిగా శ్రీరాంసాగర్ కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు వస్తాయని ఆశతో వరి పొలాలు నాటు పెట్టామని కాళేశ్వరం జలాలు రాకపోవడంతో వరి పొలాలు పూర్తిస్థాయిలో ఎండిపోతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు శ్రీరాంసాగర్ కాలువల ద్వారా కాలేశ్వరం జలాలు తీసుకువచ్చి గిరిజన రైతుల వరిపొలాలను కాపాడాలని ఆమె అన్నారు.
శ్రీరామ్ సాగర్ కాల్వ ద్వారా కొన్ని ప్రాంతాలకు నీరు వస్తుందని పెన్ పహాడ్ మండలంలో శివారులో ఉన్న తండాలకు నీరు రాకపోవడంతో వరి పొలాలు పూర్తిస్థాయిలో ఎండిపోతున్నాయని ఇప్పటికైనా కాలువల ద్వారా నీరు వస్తే పొలాలు పండుతాయని పలువురు రైతులు తెలిపినారు. వారాబంది ప్రకారము వచ్చిన బోర్లలో బావులలో భూగర్భ జలాలు పైకి వచ్చి నీరు దొరుకుతుందని కొంతమేరకైనా వరి పొలాలు పండుతాయి అని పలువురు రైతులు తెలిపినారు.
By : NageshwarRao, Penpahad
MOST READ :
- Hyderabad : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మదీనా బాధితులకు ప్రభుత్వం అండ..!
- Nalgonda : నల్గొండలోని వైద్య కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం.. హాజరైన జిల్లా కలెక్టర్..!
- Miryalaguda : ఎస్.వి.మోడల్ హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్..!
- కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు..!