Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలుటెక్నాలజీవిద్య

Miryalaguda : ఎస్‌.వి.మోడల్ హై స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్..!

మిర్యాలగూడలోని వాసవి నగర్‌లో ఎస్‌.వి. మోడల్ హై స్కూల్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్‌ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలను ప్రదర్శించారు.

Miryalaguda : ఎస్‌.వి.మోడల్ హై స్కూల్‌లో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్..!

మిర్యాలగూడ :

మిర్యాలగూడలోని వాసవి నగర్‌లో ఎస్‌.వి. మోడల్ హై స్కూల్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ ఎగ్జిబిషన్‌ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై తమ ప్రతిభను ప్రదర్శిస్తూ వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలను ప్రదర్శించారు. ఎగ్జిబిషన్‌లో దాదాపు 150 శాస్త్రీయ నమూనాలు (ఎగ్జిబిట్స్) ప్రదర్శించబడగా, పర్యావరణ పరిరక్షణ, పునర్వినియోగ శక్తి వనరులు, ఆరోగ్య విజ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.

చిన్నారులలో సృజనాత్మకతను పెంపొందిస్తూ, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేసేలా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞానాన్ని ఆచరణలో చూపించడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాల డైరెక్టర్ విశాలాక్ష్మి మాట్లాడుతూ శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించడం ద్వారా భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తలు తయారవుతారని అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సైన్స్ ఎగ్జిబిషన్ విజయవంతంగా నిర్వహించడంలో ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల సృజనాత్మకత విశేషంగా నిలిచాయి. సైన్స్ బోధించే ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యామ్ సుందర్ ఘనంగా సన్మానించారు. పాఠశాల తరపున అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

MOST READ: 

మరిన్ని వార్తలు