Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!
Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా తయారు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..
సెప్టెంబర్ 6వ తేదీన వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. సెప్టెంబర్ 7 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. 9 , 10 తేదీలలో రాజకీయ పార్టీల వారీగా సూచనలు, సలహాలను అధికారులు స్వీకరిస్తారు.
సెప్టెంబర్ 21వ తేదీన వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఓటర్ల జాబితా తయారీపై ఈనెల 29వ తేదీన జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
LATEST UPDATE :
BREAKING : జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. పశు వైద్యశాల ఉద్యోగి సస్పెండ్..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!









