Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!

Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!
హైదరాబాద్, మన సాక్షి:
భారతదేశంలో శాఖాహార ఆహారంలో ప్రోటీన్ కు సంబంధించి అత్యంత కీలకమైన మూలంగా , పనీర్ ఎల్లప్పుడూ నిలుస్తుంది. సమతుల్య పోషకాహారాన్ని నిర్ధారించడంలో ఇది అతి ముఖ్యమైన పాత్రనూ పోషిస్తుంది. మాంసాహారులు అనేక రకాల ప్రోటీన్ అవకాశాలను ఆస్వాదిస్తున్నప్పటికీ, శాఖాహారులకు, పనీర్ అత్యంత ఆరోగ్యకరమైన, ప్రభావవంతమైన ఎంపికగా ఉంది – ఇది రోజువారీ భోజనంలో భర్తీ చేయలేని ఆహారంగానూ నిలుస్తుంది.
అయినప్పటికీ, చాలా మంది, ఒకే తరహా పనీర్ వంటకాలను పునరావృతం చేయడం చికాకుగా భావిస్తారు. మరీ ముఖ్యంగా సాంప్రదాయ వంటకాల్లో పనీర్ భాగం కాని ప్రాంతాలలో !. అయితే, ఎలాంటి వంటకంలో అయినా ప్రత్యేక పదార్ధంగా పనీర్‌ను నిలిపేది దాని అనుకూలత. దక్షిణాదిలోని వేడి గ్రేవీల నుండి ఉత్తరాదిలోని క్రీమీ రుచికరమైన వంటకాల వరకు, భారతదేశం అంతటా అన్ని రాష్ట్రాలనూ మెప్పించే సామర్థ్యాన్ని పనీర్ కలిగి ఉంది. అది తమిళనాడులోని పనీర్ చెట్టినాడ్ అయినా, పంజాబ్‌లోని పనీర్ టిక్కా అయినా లేదా గుజరాత్‌లో పనీర్‌తో నింపిన ధోక్లా అయినా – తినే ఆహారానికి పోషక విలువలను జోడించడానికి ప్రతి ప్లేట్‌కు పనీర్‌ను జోడించవచ్చు.
శాఖాహార ఆహారంలో పనీర్ పాత్ర గురించి గోద్రేజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శ్రీ శంతను రాజ్ మాట్లాడుతూ, “పనీర్ కేవలం ప్యాక్ చేయబడిన ఆహార పదార్థం కాదు, సమతుల్య ఆహారంలో తప్పనిసరిగా ఉండవలసిన పదార్థం. సహజ ప్రోటీన్ పొందేందుకు చక్కటి మూలం, ఒక పనీర్ ప్యాక్‌లో దాదాపు ఆరు గుడ్ల విలువైన ప్రోటీన్ లభిస్తుంది. ఈ అంశమే, మహోన్నతమైన భారతీయ ఆహార థాలిలో పనీర్‌ను ఒక ముఖ్యమైన వంటకంగా చేస్తుంది.
ఇది రుచి , పోషకాహారం రెండింటినీ సమర్ధిస్తుంది. గోద్రేజ్ జెర్సీ వద్ద , ప్రతి ఇంటికి ఆరోగ్యకరమైన మంచిని అందించడానికి మృదువైన, తాజా , నిజమైన పాలతో తయారు చేసిన పనీర్‌ను అందించడం పట్ల మేము గర్విస్తున్నాము. రోజువారీ ఆహారంలో ఆనందించదగిన భాగంగా పోషకాహారం మారుతుందని జెర్సీ పనీర్ నిర్ధారిస్తుంది. వైవిధ్యమైన ప్రోటీన్ మూలంగా పెరుగుతున్న డిమాండ్‌ను ఈ సూపర్‌ఫుడ్ చూస్తోంది.
అయితే, పనీర్‌తో వండగల వివిధ భారతీయ వంటకాల వైవిధ్యత గురించి వినియోగదారులకు అవగాహనను పెంపొందించాల్సిన అవసరాన్ని మా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అది దృష్టిలో ఉంచుకుని, మేము విస్మై ఫుడ్స్‌గా ప్రసిద్ధి చెందిన చెఫ్ తేజ పరుచూరితో ఈ విభాగంలో మొట్ట మొదటిసారిగా బ్రాండ్ భాగస్వామ్యంను చేసుకున్నాము.
ఇది వినియోగదారులను వారి వంటగదిలో రుచికరమైన పనీర్ వంటకాలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. రెసిపీ కుక్‌బుక్‌ను మా ప్యాకేజింగ్ ముందు భాగంలో ఉన్న క్యుఆర్ -కోడ్ ద్వారా అలాగే మా డిజిటల్ ఛానెల్‌ల ద్వారా వినియోగదారులు పొందవచ్చు” అని అన్నారు.
కలినరీ దృక్పథాన్ని జోడించిన చెఫ్ తేజ మాట్లాడుతూ, “పనీర్ అనేది విస్తృత శ్రేణి వంటకాల్లో ఉపయోగించ గల వైవిధ్యమైన పదార్ధం. ఇది గ్రిల్ చేసినా, వేయించినా, సలాడ్‌లలో వేసినా, కూరల్లో కలిపినా లేదా డెజర్ట్‌లో ఉపయోగించినా చాలా రుచిగా ఉంటుంది. వివిధ వంటకాల్లో పనీర్‌తో ప్రయోగాలు చేయడం, వివిధ రాష్ట్రాల రుచులను జోడించడం వల్ల పనీర్‌ను ఉత్తేజకరంగా ఉంచవచ్చు. అదే సమయంలో పోషకాహారాన్ని తీసుకుంటున్నామని నిర్ధారించవచ్చు” అని అన్నారు.
MOST READ :
-
Best Award : రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికైన వెల్దండి శ్రీధర్.. ఎవరో తెలుసా..!
-
Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
-
Iphex : ఆరోగ్యాన్ని తీర్చిదిద్దడంలో భారతదేశపు పాత్ర.. గ్లోబల్ రెగ్యులేటరీ సదస్సు..!
-
District collector : జిల్లా కలెక్టర్ భూ భారతి ఆర్టీలపై కీలక ప్రకటన.. ఆర్డీవో, తహసిల్దార్లకు ఆదేశాలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ..!









