Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
యూరియా కోసం రైతులు బారులు తీరారు. వచ్చిన కొద్దిపాటి యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. ఆరుపులు, కేకల మధ్య తొపులాటలో ఓ మహిళ రైతు సొమ్మసిల్లి పడిపోయింది.
నేలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం స్థానిక సోసైటీ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న రైతులు ‘పెద్ద ఎత్తున రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచే రైతులు రైతు వేదిక వద్ద జాతర ను తలపించే విధంగా తండోపతండాలు గా వచ్చారు.
రైతులను వరస క్రమంలో రావాలని సూచించటంతో ఎక్కువ సేపు ఉండటం ఇబ్బందిగా ఉంటుందని భావించిన రైతులు వారి వెంట తీసుకొచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు జిరాక్స్ లను క్యూలో పెట్టారు. మండల వ్యవసాయాధికారి యం.రాధ వరస క్రమంలో రైతులకు కూపన్లు జారీ చేస్తుండుగా ఒక్కసారిగా రైతులు తోపులాట జరిగింది.
అంతే అరుపులు, కేకల నడుమ గందరగోళంగా మారింది. దీంతో తొపులాట, ఆరుపుల కేకల వలన నేలకొండపల్లి కి చెందిన కె.మల్లమ్మ అనే మహిళ రైతు కు ఊపిరాడక ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. సహచర రైతులు వెంటనే స్పందించి స్థానిక ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి ప్రధమ చికిత్స చేయించారు. ఒకే చోట ఇవ్వటం సాధ్యం కాకపోవటంతో గ్రామాల వారీగా ప్రత్యేక కౌంటర్ల ను ఏర్పాటు చేశారు.
రైతులకు కూపన్లు వ్యవసాయాధికారులు, సోసైటీ అధికారులు, పోలీసు శాఖ అధికారులు కూపన్లు జారీ చేశారు. కాగా ప్రస్తుతం వచ్చిన యూరియా కే కాకుండా రానున్న యూరియా కు కూడ ముందుగానే కూపన్లు జారీ చేశారు.
MOST READ :
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!
-
District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పరిశీలన..!
-
Miryalaguda : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంకు దరఖాస్తులు చేసుకోవాలి..!









