Pavan Kalyan: కోరిక నెరవేరింది.. తెలంగాణలో మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్..!
Pavan Kalyan: కోరిక నెరవేరింది.. తెలంగాణలో మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్..!
జగిత్యాల జిల్లా ప్రతినిధి, (మన సాక్షి):
ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. శనివారం ఉదయం కొండగట్టు చేరుకున్న పవన్ అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన కొండగట్టు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకునే మార్గం మధ్యలో పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కు స్వాగతం పలికారు. కొత్తపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు
పవన్ టూర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో పూర్ణకుంభంతో స్వాగతించిన పురోహితులు. అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, ఆర్డీఓ మధు సుధన్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.
మొక్కులు చెల్లించిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి, తదుపరి దేవస్థానం ఈ. ఓ. చంద్ర శేఖర్ శేషవస్త్రం ప్రసాదం, స్వామి వారి చిత్రపటం ఇచ్చి సన్మానించారు. ఎన్నికలకు ముందు ముడుపులు కట్టిన పవన్, ఇవాళ మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవటంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. పవన్ కళ్యాణ్ దర్శనం అనంతరం తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరారు.
ALSO READ :
Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!
Job Mela : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 65 కంపెనీలతో మెగా జాబ్ మేళా..!










