Breaking Newsఆంధ్రప్రదేశ్

Pavan Kalyan : ఇద్దరు కూతుళ్లతో పవన్ కళ్యాణ్.. ఫోటో, వీడియో వైరల్..!

Pavan Kalyan : ఇద్దరు కూతుళ్లతో పవన్ కళ్యాణ్.. ఫోటో, వీడియో వైరల్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తన ఇద్దరు కూతుళ్లు ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం తన ఇద్దరు కూతుళ్లు ఆద్య కొణిదెల, అంజని కొణిదెల తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిని వినియోగించారని ఆరోపణలు రావడంతో అపచారం జరిగిందంటూ ప్రాయాశ్చిత దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా గత నెల 22వ తేదీన పాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష అనంతరం బుధవారం ఆయన తిరుమలలో విరమించారు.

 

 

దీక్ష విరమించడానికి ముందు మంగళవారం సాయంత్రం మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండపైకి ఆయన గోవింద నామ స్మరణ చేస్తూ 3,550 మెట్లు ఎక్కారు. తిరుమల కొండపైకి పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు.

ఈ సందర్భంగా పవన్ చిన్న కుమార్తె సలినా అంజనీ కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఆమె డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పై సంతకాలు చేశారు. కాగా ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

LATEST UPDATE : 

 

మరిన్ని వార్తలు