Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Penpahad : నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు..!

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయం. వీరభద్ర స్వామి ఆలయంలో. పెన్ పహాడ్ శంభు లింగేశ్వరాలయంలో. అనంతారం. లింగాల. శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిమంది గా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Penpahad : నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు..!

పెన్ పహాడ్, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని నాగులపహాడ్ త్రికుటేశ్వరాలయం. వీరభద్ర స్వామి ఆలయంలో. పెన్ పహాడ్ శంభు లింగేశ్వరాలయంలో. అనంతారం. లింగాల. శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిమంది గా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

నాగులపహాడ్ త్రికుటేశ్వర ఆలయమునకు సూర్యాపేట జిల్లా తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. భక్తుల సందడి విపరీతంగా పెరిగింది. పురోహితుడు వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో వేద తంత్ర మంత్రలతో పూజలు నిర్వహించారు.

గణపతి హోమం. అభిషేకాలు. స్వామి అమ్మ వారి ఊరేగింపు భజనలు సన్నాయి చ ప్పులతో నిర్వహించారు.. రాత్రి సమయంలో శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగుల పహాడ్ గ్రామ సర్పంచ్ సంకరమర్ది నిరంజన్ రెడ్డి.

ఉప సర్పంచ్ రాయలి రమేష్. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఒగ్గు సతీష్. గౌరవ అధ్యక్షులు కొండ జానకి రాములు. స0కర మద్ది శ్రవణ్ రెడ్డి. సంకర మద్ది పుల్లారెడ్డి. రాయిలి శ్రీనివాస్. సంకర మద్ది జగ్గారెడ్డి. పోగుల జాన్. పాత్రికేయులు ధనియాకుల వెంకటేశ్వర్లు. చెరువుపల్లి నాగేశ్వరరావు పాలకూరి రవి. సుంకరబోయిన సతీష్. పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం..!

  2. Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

  3. TG News: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఏ మునిసిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందో తెలుసుకుందాం..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు