Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

AP News : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి..!

AP News : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలి..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే. పట్టాభిరామ్ తెలిపారు. మదనపల్లి పట్టణం మిషన్ కాంపౌండ్ నందు జేసీయం కమ్యూనిటీ హాల్ నందు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపైన సమీక్ష సమావేశం జరిగింది.

మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి పట్టాభి రామ్,ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. ఇందులో భాగంగా మదనపల్లి పట్టణంలో బైపాస్ రోడ్డులోని కంపోస్ట్ యార్డును క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అలాగే యార్డులో ప్రాజెక్టుల పనితీరును పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

అలాగే వీటి నిర్వహణలో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆంతతరం అధికారులు, సచివాలయ సిబ్బంది,పారిశుధ్య కార్యదర్శులతో సమీక్ష కొనసాగింది. ఈ సందర్బంగా ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ గ్రామాలు వార్డుల నుంచి సేకరించిన చెత్తను కంపోస్ట్ యాడుకు తరలించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తామని ప్రకటించారు.

25 నుంచి 30 కిలోమీటర్ల దూరం నుండి చెత్తను సేకరించే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజల్లో ప్రభుత్వంపైన సదాభిప్రాయం కలుగుతుందన్నారు. ప్రతి పంచాయతీలోనూ కంపోస్ట్ యార్డులను సద్వినియోగం చేసుకొని సంపద సృష్టికి శ్రీకారం చుట్టాలని శ్రీకారం చుట్టాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ను ప్రారంభించి స్వచ్ఛభారత్ స్వచ్ఛఆంధ్ర కలను సాకారం చేయాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షనులో ర్యాంకును మరింత మెరుగుపరిచే విధంగా ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పారిశుద్ధ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

పారిశుద్ధ్య విభాగం పరిశుభ్రతను ప్రాధాన్యతగా తీసుకొని బాధ్యతగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్య విభాగాన్ని అద్వాన్నంగా మార్చిందని దాంతో, రాష్ట్రం చెత్త మయంగా మారిందని విమర్శించారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అందించే 35 ఆటోలను సద్వినియోగం చేసుకొని,సక్రమంగా వినియోగించు కోవాలన్నారు. మదనపల్లి మున్సిపాలిటీ పరిసరాల్లో ఉన్న గ్రామ పంచాయతీలలో 40 వేల మంది వున్నారని, ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుకు మరిన్ని ఆటోలు కేటాయించాలని చైర్మనును కోరారు.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ను దుశ్యాలువ, పుష్పగుచ్చంతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్.డి.కే నాగరాజు, మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి, చిత్తూరు పుంగనూరు, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, మున్సిపల్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Tasildar : చింతపల్లి మండల తహసిల్దార్ గా విజయలక్ష్మి.. ఎవరో తెలుసా..! 

  2. Chevella : మీర్జాగూడ బస్సు ప్రమాదంలో కంట తడి పెట్టిస్తున్న దృశ్యం.. మృతుల్లో మూడు నెలల చిన్నారి.. సంఘటన స్థలంలో (వీడియో)

  3. Alumni : మూడేళ్లు కలిసి చదువుకున్నారు.. 46 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు.. అద్భుతమైన ఆత్మీయ సమ్మేళనం..!

  4. Champion : నేషనల్ గేమ్ ఛాంపియన్‌కు ఎంపికైన యువతి.. దాతల కోసం ఎదురుచూపు..!

మరిన్ని వార్తలు