TOP STORIESBreaking Newsజాతీయం

Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ పై ఎక్కువ మంది ఆధారపడ్డారు. ప్రతి చిన్న లావాదేవీ కూడా డిజిటల్ లోనే కొనసాగిస్తున్నారు. కానీ డిజిటల్ పేమెంట్స్ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సంచలన నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యూపీఐ సేవలో మార్పులు రాబోతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటియం ఇతర యాప్ లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న యూపీఐ యాప్ లలో ఆ ఫీచర్ మాయం కానున్నది. దాంతో పర్సన్ టు పర్సన్ డబ్బులు పంపలేరు.

పర్సన్ టు పర్సన్ (P2P), కలెక్ట్ రిక్వెస్టులు స్వీకరించబోమని ఎన్ పి సి ఐ ప్రకటించింది. రిక్వెస్ట్ ల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని NPCI ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్లీజ్ పే రిక్వెస్ట్ అనేది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉండదు.

లావాదేవీలు జరపాలంటే స్కాన్ పే లేదా యూపీఐ ఐడి/ఫోన్ నెంబర్ కానీ ఉపయోగించి పిన్ నెంబర్ ద్వారా లావాదేవీ జరపాలి. దానివల్ల సైబర్ నేరాలను అరికట్టవచ్చునని NPCI భావించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ మార్పులు రాబోతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే వాడే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

SIMILAR NEWS : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
  2. UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!
  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

మరిన్ని వార్తలు