TOP STORIESBreaking Newsజాతీయంటెక్నాలజీ

UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల పరిమితి ఎంత.. పెంచుకోవచ్చా.. తెలుసుకుందాం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. టీ, కాఫీ కూరగాయల కొనుగోలు నుంచి భారీ వస్తువుల కొనుగోలు వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ కే మొగ్గుచూపుతున్నారు. అయితే ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. లావాదేవీల విషయంలో పరిమితి ఎంత ఉంది. దానిని పెంచుకునే అవకాశం ఉందా..? తెలుసుకుందాం..

ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఎంత కావాలంటే అంత లావాదేవీలు చేయడం సాధ్యం కాదు. ఒక లక్ష రూపాయల పరిమితిని విధించాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి 24 గంటల్లో ఒక లక్ష రూపాయల లావాదేవీలు చేయవచ్చును. అది కూడా 10 సార్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరపడానికి వీల్లేదు. 24 గంటల తర్వాత మళ్లీ లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. కానీ నెలకు, సంవత్సరానికి సంబంధించిన పరిమితులు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎస్బిఐ (SBI) మాత్రం రోజుకు 24 గంటల్లో లక్ష రూపాయల లావాదేవీలను చేసుకోవొచ్చునని తెలియజేసింది.

యూపిఐ లిమిట్ పెంచుకోవచ్చా..?

యూపీఐ లిమిట్ పెంచుకోవాలంటే ఎస్బిఐ ఖాతా ఉన్న వినియోగదారులు యోనో యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ కలిగి ఉండాలి. అవి కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితేనే పరిమితి ఎక్కువగా ఉంటుంది. కానీ డిజిటల్ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువ లిమిట్ పెంచుకోలేము. కానీ తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంది.

■ Similar News : 

  1. UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో వెంటనే ఇది ఆఫ్ చేయండి.. లేదంటే మీ ఎకౌంటు ఖాళీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే సేవలు నిలిచిపోనున్నాయి.. బిగ్ అలర్ట్..!

  4. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు