Phone Taping : ఖమ్మం జిల్లా లో ఫోన్ ట్యాంపింగ్ కలకలం…!
Phone Taping : ఖమ్మం జిల్లా లో ఫోన్ ట్యాంపింగ్ కలకలం…!
నేలకొండపల్లి, మన సాక్షి:
రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఫోన్ ట్యాంపింగ్ ఖమ్మం జిల్లా లో కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం కు సమీపంలోని ఓ మామిడి తోటలోని గెస్ట్హౌజ్ను కేంద్రం గా చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాంపింగ్ లు జరిగినట్లు స్పెషల్ ఇన్విస్టేషన్ బ్యూరో అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
సోమవారం ఖమ్మం జిల్లా లోని నేలకొండపల్లి మండలం లో ఎస్ఐబీ అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియా లో టోల్ అవుతుంది. పాలేరు నియోజకవరం లోని పలువురు రాజకీయ నేతలు. వివిద శాఖల అధికారులు కాంట్రాక్టర్లు ఫోన్లు ట్యాంపింగ్ చేసినట్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కాగా నేలకొండపల్లి మండలం లోనే బోదులబండ, మోటాపురం, రాజేశ్వరపురం తదితర గ్రామాలలో ఉన్న మామిడి తోటల లో జరిగి ఉండవచ్చునని చర్చ సాగుతుంది.
సంబంధిత అధికారులు క్షేత్ర స్తాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఫోన్ ట్యాంపింగ్ విషయం ఒక్కసారిగా ఖమ్మం జిల్లా వైపు రావటంతో పెద్ద చర్చంశనీయంగా మారింది. ఇటీవల నల్లగొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం లోని ఓ మామిడితోటను కూడ తనీఖీలు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద నేలకొండపల్లి మండలం ఫోన్ ట్యాంపింగ్ లో ఒక్కసారిగా తెరపైకి రావటంతో చర్చంశనీయంగా మారింది. కానీ ఈ విషయం పై స్తానిక పోలీసులను వివరణ కోరగా వారు దృవీకరించలేదు.
ALSO READ :
- BREAKING : గద్దర్ కూతురుకు షాక్.. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!
- BIG BREAKING : ఆన్ లైన్ యాప్ వేదింపులు.. యువకుడి ఆత్మహత్య..!
- Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!
- Sleeping on The Foor : నేలపై పడుకుంటున్నారా.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!
- Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!









