రహదారిపై ఎప్పటికప్పుడు పోలీసుల అలర్ట్

ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ ఆపూర్వరావు శుక్రవారం చింతపల్లి మండలం పోలీస్ స్టేషన్ వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ల వద్ద పోలీసుల విధి నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు.

రహదారిపై ఎప్పటికప్పుడు పోలీసుల అలర్ట్

చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిశీలించిన జిల్లా ఎస్పీ పూర్వరావు

చింతపల్లి, మనసాక్షి:

ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ ఆపూర్వరావు శుక్రవారం చింతపల్లి మండలం పోలీస్ స్టేషన్ వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ల వద్ద పోలీసుల విధి నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు.

అదేవిధంగా మండలంలో ఎక్కడ ఎక్కడ పోలింగ్ బూతులు ఉన్నాయో సమస్యాత్మక గ్రామాలు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలను ఎస్ ఐ డి సతీష్ రెడ్డి ని అడిగి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఎన్నికల ఓటింగ్ సెంటర్లను వారు పరిశీలించారు. రహదారిపై ఎప్పటికప్పుడు పోలీసులు అలర్ట్ గా ఉండి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేయాలన్నారు.

మద్యం, డబ్బులు తీసుకెళుతున్నట్లయితే వెంటనే ఆ వాహనాలు సీజ్ చేసి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వీరి వెంట దేవరకొండ డిఎస్పి, నాంపల్లి సిఐ, చింతపల్లి ఎస్ఐ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ALSO READD : KTR : ట్విట్టర్ టిల్లు కేటీఆర్.. ప్రశ్నిస్తే ఎకౌంట్ బ్లాక్.. సోషల్ మీడియాలో వైరల్..!