Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : పేకాట స్థావరం పై పోలీసుల దాడులు..!

Narayanpet : పేకాట స్థావరం పై పోలీసుల దాడులు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న శాసన్ పల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు శనివారం డబ్బులు పందెం పెట్టుకొని పేకాట ఆడుతుండగా, పేకాట స్థావరం పై పట్టణ పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు 2400/- రూపాయల డబ్బులు మరియు 52 పేకా ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

వీరంతా నారాయణపేట మరియు శాసన్ పల్లి గ్రామాలకు చెందిన వారని ఎస్సై తెలిపారు. ఇట్టి వ్యక్తులను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి గేమింగ్ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఇట్టి దాడిలో హెడ్ కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ లింగమూర్తి, అశోక్, సుధాకర్ మరియు హోంగార్డ్ శ్రీనులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత..!

  2. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  3. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

  4. Miryalaguda : గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ర్యాంక్.. వినీషా..!

  5. Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు