Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : పోలీసులు ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి..!

Miryalaguda : పోలీసులు ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలి..!

నల్లగొండ / మిర్యాలగడ, మన సాక్షి:

నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, మాడుగుల పల్లి, వేములపల్లి, మిర్యాలగూడ 1టౌన్, 2 టౌన్, రూరల్ పోలీసు స్టేషన్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తనిఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును, వివరాలు, అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ల పరిసరాలు, పరిధిలోని స్థితిగతులు,పోలీస్ స్టేషన్ రికార్డుల వివరాలు,క్రైమ్ రేటు, శాంతి భద్రతలకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

పోలీసు స్టేషన్ కు వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. రానున్న రోజుల్లో మరింత సమిష్టిగా శ్రమించాలని కోరారు. గ్రామస్థాయిలో పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాలన్నారు. సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గ్రామాలలో సమస్యలకు కారణమయ్యే వారిని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలన్నారు .

గ్రామాలు ప్రశాంతంగా కొనసాగేలా ప్రజలను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర రాజు, ఎస్బి సిఐ రాఘవరావు, శాలిగౌరారం సిఐ శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, 2 టౌన్ సిఐ నాగార్జున,1 టౌన్ సిఐ సుధాకర్ ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ ; 

BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!

Miryalaguda: రైస్ మిల్లుల్లో పొల్యూషన్ అధికారుల తనిఖీలు..!

మరిన్ని వార్తలు