BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!

తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ మంత్రి మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

BIG BREAKING : రైతులను రుణ విముక్తులను చేస్తాం.. కట్ ఆఫ్ డేట్ ఇదే..! రేవంత్ ప్రకటన..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ మంత్రి మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు 28 వేల కోట్ల రూపాయలను పంట రుణాలను మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డిసెంబర్ 11 2018 వ తేదీని కటాఫ్ గా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చినట్లు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మంత్రిమండలి మొత్తం తీర్మానం చేసినట్లు తెలిపారు. విధివిధానాలపై త్వరలో జీవో జారీచేయునట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేయడమే లక్ష్యమని తెలిపారు.

2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ చేయడానికి 31 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకే విడత చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని, వడ్డీలు చెల్లిస్తామని విడతల వారీగా చెల్లిస్తున్నట్లుగా చెప్పి రైతులను మోసం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : 

Nalgonda: పనిచేయని వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వార్నింగ్..!

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!