Nalgonda: పనిచేయని వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వార్నింగ్..!

ప్రభుత్వ జీతం పొందుతూ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు, అధికారులు, హెచ్ఓడీలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ,కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశమయ్యారు.

Nalgonda: పనిచేయని వారు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలి.. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వార్నింగ్..!

నల్లగొండ, మనసాక్షి :

ప్రభుత్వ జీతం పొందుతూ పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ప్రజల కోసమే పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులు, అధికారులు, హెచ్ఓడీలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ,కళాశాల ప్రిన్సిపాల్ లతో సమావేశమయ్యారు.

తాను జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లో అనేక మార్పులు రావాల్సి ఉందని అన్నారు. వారం రోజుల్లో ఆసుపత్రిలోని ఆయా డిపార్ట్మెంట్ల వారిగా సమీక్ష నిర్వహిస్తాను. ఇందుకు హెచ్ ఓ డి లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి అన్నారు.

అధికారులు, సిబ్బంది, డాక్టర్లు సమయపాలన పాటించాలి అన్నారు శానిటేషన్ ను మెరుగుపరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంపొందింపజేయాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిరోజు రెండు గంటలు, తాను ప్రతివారం జిల్లా ఆస్పత్రి పై సమీక్షిస్తాను అని తెలిపారు

ప్రతిరోజు ఒక జిల్లా అధికారి జిల్లా ఆస్పత్రికి వచ్చే ఏర్పాటు చేసి అందరి హాజరును పర్యవేక్షిస్తాం, తక్షణ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాం అన్నారు.  ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు ఎక్కడైనా కొరత ఉన్నట్లయితే వెంటనే ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలి, కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తనలో మార్పు రావాలన్నారు.

రోగులు వారి సహాయకుల నుండి ఎవరైనా డబ్బులు అడిగితే జైలుకు పంపిస్తాను అని హెచ్చరించారు. డ్యూటీ డాక్టర్లు డ్యూటీ టైం లో ఆసుపత్రిలోనే ఉండాలి. హెచ్ ఓ డి ల నియంత్రణలోనే అందరూ పని చేయాలి ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాలు, హెచ్ఓడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిరోజు నిరంతర పరిరక్షణ ఉంటుంది. అత్యవసర మందులను ఏర్పాటు చేస్తాం అన్నారు.

టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ చెత్త కనిపించకూడదు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి.  వారంలో అన్ని వార్డులలో మరమ్మతులు పూర్తి కావాలి. మున్సిపల్ ద్వారా ప్రతిరోజు ఆసుపత్రిలో చెత్తను తీసివేసే ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు తాగునీరు ఆసుపత్రికి వచ్చేలా చర్యలు చేపట్టాలి. విద్యుత్ శాఖ ద్వారా సక్రమంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలి. శానిటేషన్, భోజనం కాంట్రాక్టర్లు తప్పు చేస్తే జైలుకు పంపిస్తామని,
వచ్చే బుధవారం సమీక్ష నాటికి ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో మార్పు కనిపించాలన్నారు.

ప్రతి ఒక్కరు టీం వర్క్ చేయండి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర మాట్లాడారు.  ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింట్టిండెంట్ నిత్యానంద్, డిసిహెచ్ఎస్ మాతృ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కళ్యాణ్ చక్రవర్తి ,టి ఎస్ ఎం ఐ డి సి, విద్యుత్తు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఆయా హెచ్ ఓ డి లు, స్టాఫ్ నర్స్, పారామెడికల్ సిబ్బంది తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ALSO READ : 

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

BIG BREAKING : నిన్న బెయిల్.. నేడు స్టే, జైలులోనే కేజ్రీవాల్..!