విద్యుత్ ఘాతంతో పంచాయతి కార్మికుడు మృతి , గ్రామంలో విషాదఛాయలు – latest news

విద్యుత్ ఘాతంతో పంచాయతి కార్మికుడు మృతి , గ్రామంలో విషాదఛాయలు

మాడ్గులపల్లి , సెప్టెంబర్07, మనసాక్షి: విద్యుత్ ఘాతంతో గ్రామ పంచాయతీ కార్మికుడు దుర్మరణం చెందిన సంఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన విధంగా సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాడ్గులపల్లి మండలంలోని కన్నెకల్ గ్రామ పంచాయతీలో మల్టిపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న గంటకంపు నరేష్ (23) గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సమీపంలోని గార్లకుంటపాలెం గ్రామంలోఉన్న కన్నెకల్ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను తీసుకొని వస్తుండగా గ్రామంలో ఒక ఇంటికి వెళ్లే విద్యుత్ తీగలు క్రిందకు వేలాడబడి ఉండగా పైకి ఎత్తి ముందుకు వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు.

గత రెండు ఏళ్ల క్రితం మృతుని మొదటిభార్య ఐకేపీ సెంటర్ నిర్వహణలో భాగంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా విద్యుత్ ప్రమాదంలో నరేష్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ను కోల్పోయిన చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీటి పర్వతమౌయ్యారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రికి తరలివచ్చారు. నరేష్ మృతదేహాన్ని ఎంపిపి పోకల శ్రీవిద్యరాజు, ఎంపిడిఓ దండ జితేందర్ రెడ్డి, ఎంపీఓ రవికుమార్, సర్పంచులు కాటేపల్లి సరిత వెంకన్న, గార్లపాటి విజయ శ్రీనివాస్ రెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి :

1. BREAKING : పురుగుల మందు తాగిన భార్య, భర్తలు

2. పిడుగుపాటుకు వ్యక్తి మృతి

3. BREAKING : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

4. BREAKING : సూర్యాపేట :  కెమికల్ కంపెనీ ఎదుట రైతులు ధర్నా