Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంటెక్నాలజీతెలంగాణ

Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

Qr code scanning : నకిలీ స్కానర్లతో ముంచేస్తారు. వాటి పట్ల జాగ్రత్త, నకిలీ స్కానర్లను ఇలా తెలుసుకోండి. !

మనసాక్షి , వెబ్ డెస్క్ :

ప్రస్తుతం ఎక్కువమంది డిజిటల్ స్కానర్ లను వినియోగించి పేమెంట్ లను చేస్తున్నారు. చిన్నాచితక చిల్లర సమస్య లేకపోవడంతో పాటు క్యాష్ లెస్ పేమెంట్ ని ఎక్కువమంది ఎంచుకుంటున్నారు. యూపీఐ పేమెంట్ ల ద్వారా ఐదు రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా పేమెంట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా టీ స్టాల్, హోటల్, కిరాణా షాప్, కూరగాయలు ఇలా ప్రతి చోట కూడా స్కానర్లను వినియోగించి డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. కాగా స్కానర్లలో నకిలీ క్యూఆర్ కోడ్ లతో సైబర్ క్రైమ్ నేరగాళ్లు నట్టేట ముంచుతున్నారు.

ALDO READ : CRIME NEWS : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి భర్తే కాలయముడు.. ఏడు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..!

వీటిపట్ల ఫోన్ పే , గూగుల్ పే , పేటియం వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. జేబులో డబ్బులు పెట్టుకోకుండా లావాదేవీల విషయంలో సెల్ ఫోన్లు ఉపయోగించి స్కానర్ల ద్వారా పేమెంట్లు చేయడం అలవాటుగా మారింది. కాగా ఈ స్కానర్ ల ద్వారా ప్రమాదం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్ల తో బురిడీ కొట్టించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

అసలు క్యూఆర్ కోడ్లు స్కానర్లు నకిలీవా..? అసిలీవా? తెలుసుకోవడం ఎలా..? అంటే ఇప్పుడు చూద్దాం.

ALSO READ : సిరిసిల్ల : డాక్టర్ కాలేదు, ఐఏఎస్ కాలేదు, వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

క్యూ ఆర్ కోడ్ అంటే :

ప్రస్తుతం అనేక రకాల పేమెంట్ యాప్ లలో చాలా సులువుగా ఆర్థిక లావాదేవీలు చేసేది క్యూఆర్ కోడ్. ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా సులువుగా పేమెంట్ జరుగుతుంది. క్యూ ఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ అని అర్థం. అంటే ఎవరికైతే మనం డబ్బులు పంపాలని భావిస్తామో వారి ఖాతా వివరాలు ప్రత్యేకంగా తయారు చేసిన కోడ్ లో నిక్షిప్తమై ఉంటాయి. దానిని మనం స్కాన్ చేస్తే ఆ ఎకౌంటు వివరాలకు డబ్బు పంపవచ్చును.

అయితే ఇటీవల కాలంలో నకిలీ క్యూఆర్ కోడ్ లు కూడా పుట్టుకొస్తున్నాయి. అవి మోసాలకు జరలేపియాయి. మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అనేక సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ వ్యక్తిగత డేటా దొంగిలించబడే అవకాశం కూడా ఉంటుంది . క్యూఆర్ కోడ్ చేయడం ద్వారా ఫిషింగ్ వెబ్సైట్లను స్కానర్లు మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు.

వాస్తవానికి మీ పేరు, మీరు, సంప్రదించే నెంబర్లు, చిరునామా, బ్యాంకు వివరాలు అందిస్తే సైబర్ నేరగాళ్లు దోచుకునే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల సాఫ్ట్ వేర్ల ద్వారా క్యూఆర్ కోడ్ తయారు చేసి మీ డేటాను దొంగిలించే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ALSO READ : WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!

ఇదిలా ఉండగా మీరు నకిలీ క్యూఆర్ కోడ్లను కూడా సులభంగా గుర్తించవచ్చును. అది ఎలాగో చూద్దాం..

నకిలీ క్యూఆర్ కోడ్ ను ఇలా గుర్తించండి.

🟢 మనం ఏదైనా దుకాణం కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్ లో కానీ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే ముందు కోడ్ ఆకృతి పై చాలా శ్రద్ధ వహించండి. ఆకారం వక్రీకరించబడిందని. కోడ్ ని ఏదైనా ఒకదానిపై అతికించబడిందని మీరు భావిస్తే క్యూఆర్ కోడ్ పై చెల్లించకుండా ఉండండి.

దానికి బదులుగా నగదు రూపంలో చెల్లించడాన్ని ఎంచుకోండి. ఎటువంటి ఆకారం మారినా.. క్యూఆర్ కోడ్ నకిలీ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

🟢 మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఆ వ్యాపారి లేదా దుకాణం పేరును తనిఖీ చేయండి. డబ్బు ఏ పేరుతో బదిలీ చేయబడుతుందని దుకాణదారుని అడగండి. అదే మీరు పేరు మీ మొబైల్ స్కాన్ పై కనబడితే మాత్రమే చెల్లింపులు కొనసాగించండి. దుకాణం పేరు సరిపోలేక పోతే జాగ్రత్తగా ఉండండి.

🟢 మీ ఈ మెయిల్ ఐడి లలో లేదా జంక్ మెయిల్ ద్వారా మీరు స్వీకరించే క్యూఆర్ కోడ్ ను ఎప్పుడూ.. స్కాన్ చేయవద్దు. మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ పిన్ నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ALSO READ : TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!

మరిన్ని వార్తలు