Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!
Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!
మన సాక్షి :
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలియజేసింది. సికింద్రాబాద్ రైల్వే నుండి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా 6268 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి , ఇంటర్మీడియట్, డిప్లమా పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ ను సికింద్రాబాద్ రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పైలెట్ (ఏ ఎల్ పి) విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో మొత్తం 6268 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ALSO READ : తెలంగాణ : కేటీఆర్ ఆటో ప్రయాణానికి అంత సెటప్ ఏంటి.. (వైరల్)
అర్హత:
దీనికి కేవలం పదవ తరగతి/ఇంటర్/ డిప్లమా పూర్తి చేసి ఉండవలెను.
ఉద్యోగాలకు అప్లికేషన్ నే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తాయి.
ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ వారికి ఐదు సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.
ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!
వేతనం :
జాబ్ లో చేరగానే 40 వేల రూపాయల వేతనంతో పాటు అలవెన్సులు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ALSO READ : సూర్యాపేట : కౌన్సిలర్ ల మధ్య తలెత్తిన ఘర్షణ..! కొనసాగుతున్న అవిశ్వాస రగడ
చివరి తేదీ :
ఫిబ్రవరి 19వ తేదీ చివరి తేదీన ఉంది. దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.









