తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!

తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టనున్నారు. గత ఐదు మాసాలుగా రేషన్ కార్డుల ఈకేవైసీ కార్యక్రమం కొనసాగుతుంది. కార్డుదారుల రేషన్ కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 31వ తేదీ గడువు ఉనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నెల రోజులపాటు గడువును పెంచి ఈ కేవైసీ చేసుకుని అవకాశం కల్పించింది.

తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!

మనసాక్షి :

తెలంగాణలో బోగస్ రేషన్ కార్డుల ఏరివేత చేపట్టనున్నారు. గత ఐదు మాసాలుగా రేషన్ కార్డుల ఈకేవైసీ కార్యక్రమం కొనసాగుతుంది. కార్డుదారుల రేషన్ కార్డులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 31వ తేదీ గడువు ఉనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నెల రోజులపాటు గడువును పెంచి ఈ కేవైసీ చేసుకుని అవకాశం కల్పించింది.

తెలంగాణలో రేషన్ కార్డుల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా ఈ నెలాఖరులోగా ఈ కేవైసీ గడవు పూర్తి చేసుకునే గడువున్నది. ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం మూడు రోజులు మాత్రమే పూర్తి చేసుకోవాల్సి ఉన్నందున పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈకేవైసీ గడువును పెంచాలని అధికారులు ఆదేశించారు.

ALSO READ : BREAKING : మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన బీఎల్ఆర్..!

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు బోగస్ కార్డులను ఏరివేత కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ కేవైసీ విధానాన్ని తీసుకొచ్చి ఐదు మాసాలు గడుస్తుంది. ఈనెల 31వ తేదీతోగా ఈ కేవైసీ గడవు పూర్తవుతుంది. గడువు ముగిసే సమయం వస్తున్నందున ఈ కేవైసీ కోసం లబ్ధిదారులు రేషన్ దుకాణాలు వద్ద బారులు తీరుతున్నారు. దాంతో సర్వర్ నిలిచిపోతుంది. పలుచోట్ల ఈ కేవైసీ అప్డేట్ కావడం లేదని ఫిర్యాదుల సైతం అధికార యంత్రాంగానికి అందుతున్నాయి.

ALSO READ : BREAKING : వీగిపోయిన సూర్యాపేట బీ ఆర్ ఎస్ చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం..!

రేషన్ కార్డు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావడం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డులో ఉండడం, ఇతర ఇతర కారణాలవల్ల చౌకదారుల దుకాణం ద్వారా అందుతున్న నిత్యావసర సరుకులు దారిమల్లుతున్నాయి.

బ్లాక్ మార్కెట్ ని అరికట్టే ఉద్దేశంతో ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ కేవైసీ ప్రక్రియ చేపట్టారు. కాగా ఈనెల 31వ తేదీ నాటికి ఈకేవైసీ గడువు ఉంది. పలుచోట్ల ఇబ్బందులు కలగటం వల్ల ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కేవైసీ గడు పెంచినట్లు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. రేషన్ కార్డుదారులు మరో నెల రోజుల పాటు ఫిబ్రవరి నెలకరు వరకు ఈ కేవైసీ చేయించుకునే అవకాశం ఉంది.

ALSO READ : తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!