BREAKING : మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన బీఎల్ఆర్..!

ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

BREAKING : మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన బీఎల్ఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి : ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి – నార్కట్ పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి హుటాహుటిన మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కు వెళ్లి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మృతుల కుటుంబాలను పరామర్శించనున్న కోమటిరెడ్డి :

ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించనున్నారు. సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యుల పరామర్శించించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : BREAKING : వీగిపోయిన సూర్యాపేట బీ ఆర్ ఎస్ చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం..!