Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

BREAKING : వీగిపోయిన సూర్యాపేట బీ ఆర్ ఎస్ చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం..!

BREAKING : వీగిపోయిన సూర్యాపేట బీ ఆర్ ఎస్ చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం..!

చతురత ను చాటుకున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, మనసాక్షి :

బి ఆర్ ఎస్ పార్టీ కు చెందినం సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్ల తో పాటు కాంగ్రెస్, బి జే పి కి చెందిన 32 మంది వార్డ్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. శనివారం ఉదయం 11 గంటలకు అవిశ్వస తీర్మానం ఓటింగ్ కు రావలసిన కౌన్సిలర్ ఎవరు రాలేదు ఎన్నికల అధికారి కలెక్టర్ వెంకట్రావు వాయిదా వేసిన మధ్యాహ్నం గంటలకు తిరిగి సమావేశంలో పెట్టారు.

ఈ సమావేశంనకు ఎవరు రాక పోవడం తో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై బి ఆర్ ఎస్ కు చెందిన కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది….

ALSO READ : తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

అవిశ్వాస‌ తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది.
కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.

దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రకటించారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుల జగదీష్ రెడ్డి ఎత్తులు పలించడంతో అవిశ్వసం విగి పోయింది. అయితే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పీఠం జనరల్ స్థానం కావడం, అందులో ఎస్ సి సామజిక వర్గం నకు చెందిన మహిళా కు చైర్మన్ పదివిని కట్టబెట్టారు.

చైర్మన్, వైస్ చైర్మన్ లు ఒంటెద్దు పోకడలు పోతు, తోటి కౌన్సిలర్ లను లెక్కచేయకుండా, నిధులు ఇష్టం వచ్చినట్లు తమ వార్డులకు పెట్టుకొంటున్నారని, ఆరోపిస్తూ,32 మంది కౌన్సిలర్ లు అవిశ్వసతీర్మానం పై సంతకాలు పెట్టి కలెక్టర్ కు అందించారు కానీ అవిశ్వాసము నెగ్గించుకోలేకపోయారు . ఏది ఏమైనప్పటికి మంత్రి జగదీష్ రెడ్డి చతురత ప్రదర్శించడం తో చివరి క్షణాల్లో అవిశ్వాసం విగి పోయింది.

ALSO READ : BREAKING : మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులకు అస్వస్థత

మరిన్ని వార్తలు