BREAKING : మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులకు అస్వస్థత

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి  10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

BREAKING : మధ్యాహ్న భోజనం వికటించి పదిమంది విద్యార్థులకు అస్వస్థత

అనంతగిరి , మన సాక్షి :

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి  10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హెడ్మాస్టర్ స్కూలు విధులు నిర్వర్తించకుండా హజరైనట్లు రిజిస్టర్ లో నమోదు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించనట్లు ఇష్టానుసారంగా విధులను నిర్వహిస్తున్నారని , పర్యవేక్షణ లోపం వల్ల ఈ ఘటన జరిగిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంపై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!