సూర్యాపేట : కౌన్సిలర్ ల మధ్య తలెత్తిన ఘర్షణ..! కొనసాగుతున్న అవిశ్వాస రగడ

అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్ మధ్యన ఆదివారం మధ్యాహ్నం పరస్పర దాడులు తోపులాట జరగడంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్విక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

సూర్యాపేట : కౌన్సిలర్ ల మధ్య తలెత్తిన ఘర్షణ..! 

మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాస రగడ

సూర్యాపేట, మనసాక్షి:

అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాసానికి అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన కౌన్సిలర్ మధ్యన ఆదివారం మధ్యాహ్నం పరస్పర దాడులు తోపులాట జరగడంతో సూర్యాపేటలో తీవ్ర ఉద్విక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డు సభ్యులకు గాను అవిశ్వాసానికి మద్దతుగా 32 మంది కౌన్సిలర్ లు సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని కావాలని కలెక్టర్కు మెమోరన్నో సమర్పించారు ఈనెల 27న శనివారం అవిశ్వాస తీర్మానం జరిగింది.

అయితే అవిశ్వాస తీర్మాన కాపిలో పేరున్న 45 వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ సమావేశానికి ముందు జంప్ కావడంతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు ఎవరూ కూడా హాజరు కాకపోవడంతో సాయంత్రం వరకు సమయం ఇచ్చిన కలెక్టర్ అవిశ్వాసం వీ గిపోయిందని ప్రకటించారు.

ALSO READ : BREAKING : వీగిపోయిన సూర్యాపేట బీ ఆర్ ఎస్ చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం..!

అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన 32 మంది కౌన్సిలర్లు లలో ఒక కౌన్సిలర్ అవిశ్వాసానికి రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం దిగిపోయింది. దీంతో నేరుగా బాలాజీ గార్డెన్ కు చేరుకున్న 31 మంది కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించి తమతో కలిసి రాని గండూరి పావని కృపాకర్ చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతాడని విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

సమయానికి రాకుండా మోసం చేయడం తో ఆదివారం గండూరి పావని ఇంటి ముందు మిగతా కౌన్సిలర్ ల ధర్నా నిర్వహించారు. కోడిగుడ్లు విసరడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈలోపుగా చైర్పర్సన్ అనుకూల బీఆర్ఎస్ వర్గాలు కూడా గండూరి పావని కృపాకర్ కు మద్దతుగా అక్కడికి చేరుకోవడంతో తోపులాటలు జరిగాయి.

ఈ దాడిలో కౌన్సిలర్ కొండపల్లి నిఖిల కు గాయాలయ్యాయి.దీంతో కోపోద్రిక్తులై పరస్పరం ఇరు వర్గాల కౌన్సిలర్లు దాడి చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులు చక్కదిద్ది ఇరువర్గాలను చెదరగొట్టారు.ఇరు వర్గాల ఘర్షణ నేపథ్యంలో బారీగా పోలీసులు మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు.

ALSO READ : Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!