తెలంగాణ : కేటీఆర్ ఆటో ప్రయాణానికి అంత సెటప్ ఏంటి.. (వైరల్)

ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియో ఆ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేసిన విషయం తెలిసిందే

తెలంగాణ : కేటీఆర్ ఆటో ప్రయాణానికి అంత సెటప్ ఏంటి.. (వైరల్)

మన సాక్షి :

ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియో ఆ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేసిన విషయం తెలిసిందే. ఆటోలో ప్రయాణించి ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకున్న వీడియో తెగ వైరల్ అయింది. ఆటో కార్మికుల సమస్యల పై తాను కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తానని వారికి అండగా ఉంటానని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుదారులు అలా చేయకుంటే కట్.. గడువు మరో నెల పెంపు..!

ముందే సెటప్ ..?

ఆటోకు అంత సెట్ అప్ చేశారేంటబ్బా.. ముందుగా ఊహించుకొని ఆటోకు అంత సెటప్ చేసుకొని డ్రామా చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆటోకున్న వీడియో కెమెరాను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో కేటీఆర్ ఆటో కార్మికుల సమస్యల పై ఆటోలో ప్రయాణించిన వీడియో కంటే… ఎంత సెటప్ ముందుగానే చేశారా..? అనే విషయం మాత్రం మరింత వైరల్ అయింది. ఆటోకు కూడా ఆ పార్టీ కార్మిక విభాగం స్టిక్కర్ వేసుకోవడం, ఆటోకు వీడియో కెమెరాను అమర్చుకోవడం..

ALSO READ : BREAKING : మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన బీఎల్ఆర్..!

అంత డ్రామా అవసరమా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆటో కార్మికుల సమస్యలపై గలం విప్పడానికి అంత సెటప్ అవసరమా..? అంటే ప్రతిదీ కూడా ముందుగానే సెటప్ చేసుకుంటూ.. డ్రామాలు చేస్తున్నారంటూ.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత డ్రామా చేస్తారా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు కామెంట్స్ పెట్టొచ్చు..!