ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!

ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ పాతబస్తీలో ఏటీఎం కేంద్రంలో నోట్ల వర్షం కురిసింది. దాంతో అక్కడి జనం పండగ చేసుకున్నారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పాతబస్తీలోని యాకుత్ పురాలో ఏటీఎం కేంద్రంలో విత్ డ్రా కంటే ఎక్కువ డబ్బు వచ్చింది. ఏటీఎం నుంచి క్యాష్ ఓవర్ ఫ్లో అయింది.
ఇద్దరు వ్యక్తులు రూ. 3000 విత్ చేయాలని ప్రయత్నించగా వారికి ఏటీఎం 4000 రూపాయలు ఇచ్చింది. బ్యాంకు ఖాతాలు క్రాస్ చెక్ చేయగా 3000 రూపాయల డెబిట్ అయినట్లు వారికి ఎస్ఎంఎస్ వచ్చింది. ఈ విషయం తెలియడంతో కొందరు ఏటీఎం సెంటర్ వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేశారు. వారు అడిగిన దానికంటే ఎక్కువ నగదు ఇస్తున్నట్లు అర్థమైంది.
ఈ విషయం ప్రజలందరికీ తెలియడంతో ఏటీఎం సెంటర్ కు పరుగులు పెట్టారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకొని అందరిని చదరగొట్టారు. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు అధికారులు ఏటీఎం సెంటర్ ను మూసివేశారు.
MOST READ :
-
Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
Accident : తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. ఢీకొన్న బస్సు, జీపు..!
-
Miryalaguda : రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు..!
-
Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!









