రసమయి బాలకిషన్ బహిరంగ చర్చకు సిద్దమా ?
రసమయి బాలకిషన్ బహిరంగ చర్చకు సిద్దమా ?
రాజన్న సిరిసిల్ల, ఇల్లంతకుంట, మన సాక్షి: బిఆర్ యస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ పై చేసిన అనుచిత వాక్యాలపై మానకోండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ శాసనసభ్యుడు రసామయి బాలకిషన్ చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు మేము సిధ్దం మీరు సిధ్దమైతే ఇల్లంతకుంట మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ముందు చర్చ పెట్టి మండల ప్రజలకు వివరిద్దం సమయం శాసనసభ్యుడు రసామయి బాలకిషన్ చెప్పలన్నారు.
ఎంతసేపు కల్యాణలక్ష్మి చెక్కులు,సియం ఆర్ యఫ్ చెక్కలు ఇంటిఇంటికి వెళ్లి ఇచ్చిరావడం అభివృద్ధి కాదన్నారు. ఇకనైనా మండల ప్రజలు వాస్తవాలు గమనించింలని కోరారు. మేము మీరు ఇచ్చిన హామీలు మాత్రమే గుర్తు చేస్తున్నాం వెంటనే క్రీడాకారులకు మైదానం కేటాయించాలని డిమండ్ చేశారు.
అసంపూర్తిగా ఉన్న కులసంఘ భవనాలను పూర్తి చేయాలని కోరారు. ఇంకా ఎన్ని ప్రమాదలు జరిగితే రోడ్లు వెడల్పు చేస్తారని అడిగారు.
ఈ కార్యక్రమంలో జిల్ల కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు చిట్టి ఆనంద రెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపోచయ్య, మైనర్టీ అధ్యక్షుడు జమాల్, యసి సి సేల్ అధ్యక్షుడు మచ్చ రాజేశం,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏర్రోజు సంతోష్, జిల్ల కన్వీనర్ జుట్టు నగేష్,బిసి సి సేల్ నాయకులు తాట్ల వీరేశం, శ్రీనివాస్, నారయణ,జెట్టి మల్లేశం, స్వామి, తదితరులు పాల్గొన్నారు.









