Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రేషన్ బియ్యం దందా.. పోలీస్ నిఘా, ఇద్దరి అరెస్ట్..!

Miryalaguda : రేషన్ బియ్యం దందా.. పోలీస్ నిఘా, ఇద్దరి అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. మిర్యాలగూడ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పట్టణం కావడంతో ముఠా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలిస్తున్నారు.

ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా మిర్యాలగూడ పోలీసులు నిఘా పెట్టారు. దాంతో ఇటీవల ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో ఇద్దరిని రెస్ట్ చేశారు. డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం..

గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆదేశాలను దిక్కరిస్తూ దామరచర్ల, మిర్యాలగూడ మండలాల్లో అమాయక రేషన్ కార్డుదారుల నుండి మోసపూరితంగా రేషన్ బియ్యం ను కొనుగోలు చేస్తున్న బండ సర్దార్, వల్లపు కామేశ్వరరావు లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి 13 క్వింటాళ్ల రేషన్ బియ్యం, వాహనం ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

దామరచర్ల మండలం బండవత్ తండా చెందిన బండావత్ సర్దార్ 10 సంవత్సరాలుగా రేషన్ కార్డుదారుల వద్ద బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. వాటిని దాచేపల్లి చెందిన వ్యక్తికి విక్రయిస్తున్నాడు. కాగా దాచేపల్లికి తరలిస్తుండగా అక్టోబర్ 10వ తేదీన అశోక్ లేలాండ్ మినీ గూడ్స్ వాహనం నరసాపురం వద్ద బోల్తా పడి ఒకరు మరణించారు.

వాహనంలో పిడిఎస్ బియ్యం తరలిస్తున్న మందపాటి నరసింహారావు, కల్లూరి లింగయ్యలను నవంబర్ 19వ తేదీన అరెస్టు చేశారు. విచారణలో బండావత్ సర్దార్ పాత్ర ఉందని పరారీలో ఉన్న సర్దార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న నరసింహారావు, లింగయ్యలపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు, పద్ధతులు మార్చుకోకుంటే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపమన్నామని తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ వీరబాబు, ఎస్ఐ హరికృష్ణ తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు