Miryalaguda : మున్సిపాలిటీలో వారికి రెడ్ నోటీసులు జారీ.. షాపులు సీజ్..!
Miryalaguda : మున్సిపాలిటీలో వారికి రెడ్ నోటీసులు జారీ.. షాపులు సీజ్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా టార్గెట్ పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు.
మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఏడు కోట్ల రూపాయల ఆస్తి పన్నును మున్సిపల్ అధికారులు వసూలు చేశారు. మరో మూడు కోట్ల రూపాయల ఆస్తి పన్నును ఈ నెలాఖరులోగా వసూలు చేయాల్సి ఉంది. అందుకుగాను మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేశారు.
పట్టణంలో కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాల వేరువేరు జాబితాను తయారుచేసి జాబితాలో ఎక్కువ కాలంగా అత్యధిక ఆస్తి పన్ను చెల్లించాల్సిన మొండి బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు. వారికి మున్సిపల్ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు.
అంతే కాకుండా పట్టణంలోని మొండి బకాయి దారుల షాపులను సైతం సీజ్ చేశారు. ఆస్తి పన్ను చెల్లించి మిర్యాలగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, మున్సిపల్ కమిషనర్ యూసఫ్ పేర్కొంటున్నారు.
MOST READ :
-
Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!
-
WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!
-
Gold Price : పసిడి సరికొత్త రికార్డు.. తులం ఎంతంటే..!










