మిర్యాలగూడ : మనసాక్షి కి స్పందన.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనులు ప్రారంభం..!
మిర్యాలగూడ : మనసాక్షి కి స్పందన.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనులు ప్రారంభం..!
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
మనసాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. వెంటనే పనులు ప్రారంభం నుంచి ప్రజల సమస్యలను పరిష్కరించారు. దాంతో మన సాక్షికి స్థానికులు వందనం అని తెలిపారు.
వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి భీమవరం మీదుగా సూర్యాపేట వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల మయంగా మారింది. దాంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి మన సాక్షి దినపత్రికలో “ప్రమాదకరంగా గుంతలు… ప్రయాణం చేసేది ఎలా” అనే శీర్షికతో ప్రచురించింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ సంబంధిత ఆర్.అండ్.బి అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అధికారులు భీమవరం, సూర్యాపేట రహదారి గుంతలను మరమ్మతులు చేపట్టారు. గురువారం ఎమ్మెల్యే బిఎల్ఆర్ రహదారి మరమ్మతుల పనులను దగ్గరుండి పరిశీలించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడబోయిన అర్జున్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
NALGONDA : డిజిటల్ బోధన తీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన.. విద్యార్థులతో ముఖాముఖి..!
SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!










