Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KCR : ఈస్ట్ మన్ కలర్ లా తెలంగాణ బడ్జెట్, ఏ రంగానికి ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసిఆర్..!

KCR : ఈస్ట్ మన్ కలర్ లా తెలంగాణ బడ్జెట్, ఏ రంగానికి ప్రాధాన్యత లేదు.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసిఆర్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ 2024- 25 వార్షిక బడ్జెట్ ఈస్ట్ మల్ కలర్ లా ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడ్జెట్ పత్రాలు చదివే సమయంలో మంత్రి వత్తి పలకడం తప్ప వేరే ఏం లేదన్నారు. ఏ రంగాలకు కూడా స్పష్టమైన ప్రణాళిక లేకుండా ఉందన్నారు.

పారిశ్రామిక రంగం, ఐటి రంగాలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రైతుబంధు, రైతు భరోసా కు ప్రాధాన్యత ఇవ్వలేదని రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. మత్స్య కార్మికులకు స్పష్టత లేదని, మహిళలకు భరోసా ఇవ్వలేదని, మహిళలకు ఇచ్చే రుణాలు పాత పథకమే అని రుణాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, బ్యాంకులు ఇస్తాయని స్పష్టం చేశారు.

దళిత బంధు పథకం ఊసే లేదని, గొర్రెల పథకం ఎత్తేసినట్లేనా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం బడ్జెట్ ఈస్ట్ మన్ కలర్ లా ఉంది.. తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగకరంగా లేదని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి : 

BUDGET 2024 – 25 : అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.. ముఖ్యాంశాలు..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

BIG BREAKING : అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా..!

మరిన్ని వార్తలు