తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డిరాజకీయం

TG News : 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 35 పైసలు కూడా తీసుకురాలేదు..!

TG News : 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి.. 35 పైసలు కూడా తీసుకురాలేదు..!

రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు ప్రతినిధి,  మనసాక్షి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 35 సార్లు ఢిల్లీ వెళ్లి 35 పైసలు కూడా తీసుకు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని మాడ్గుల రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన చేపట్టిన రైతు దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణి దేవి,మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. అంతకు ముందు ఆమనగల్లు పట్టణ కేంద్రానికి చేరుకున్న కేటీఆర్ ను బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.

పట్టణంలోని జాతీయ రహదారి నుండి నాయకులతో కలిసి రోడ్డు మార్గన కళాశాల ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి 10 శాతం మందికి కూడా రైతుబంధు వేయలేదని రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎకరానికి 17,500 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్తగారి నియోజక వర్గమైన కల్వకుర్తిలో కూడా మహిళలకు తులం బంగారం అందలేదని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాలను
అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు 600 కోట్లు మంజూరు చేయలేక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సర్పంచుల ఆత్మహత్య లకు కారణ మవుతున్నారని విమర్శించారు. ప్రపంచానికి అన్నం పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ ప్రపంచానికే అన్నం పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదులుకున్న రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బాధ పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.

ఆనాడు 11 సంవత్సరాల కిందట పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన ఫిబ్రవరి.18న పాలమూరులో రైతులు దీక్షకు దిగడం చూస్తుంటే బాధేస్తుంది ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సీఎం అంటూ యువకుల నినాదాలు రైతు దీక్ష సభలో కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో సభా ప్రాంగణానికి దగ్గరలో ఉన్న యువకులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆపండి అయ్యా అంటూ కొంత అసహనం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు దశరథ నాయక్, అనురాధ, నిర్మల పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహా రెడ్డి, ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షులు పత్య నాయక్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!

  2. District collector : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  3. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు