BREAKING : ఆ 12 అంశాలపై ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ..!
BREAKING : ఆ 12 అంశాలపై ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క భేటీ..!
మన సాక్షి:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. గురువారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి పలు అంశాలపై చర్చించారు. 12 అంశాలపై ప్రధాన మంత్రికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.
– కేంద్రం వేలం జాబితా నుండి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును తొలగించి, సింగరేణికి కేటాయించాలి. కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికి కేటాయించాలి.
– తెలంగాణకు IIM మంజూరు చేయాలి.
– ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్టు పునరుద్ధరించాలి.
•కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి.
– ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలి
– రాబోయే 5 ఏండ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలి.
– పెండింగ్‌లో ఉన్న BRGF గ్రాంట్ ను తక్షణం విడుదల చేయాలి.
– రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి.
– ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
•రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలి. భారత్ మాల పరియోజనలో దీనిని కలపాలి.
– 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలి
– కొత్త జిల్లాల్లో 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలి.
ALSO READ :
TS EAPSET 2024 Counselling : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి..!
WhatsApp : కొత్త టెక్నాలజీ పై ఫోకస్ పెట్టిన వాట్సప్.. మరో రెండు కొత్త ఫీచర్లు..!










