Nalgonda : మోడీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీ పై మాట్లాడాలి..!
Nalgonda : మోడీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీ పై మాట్లాడాలి..!
-
జూన్ 25 చరిత్రలో చీకటి రోజు
-
బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు ఎంపీ డీకే అరుణ
నల్లగొండ, మన సాక్షి :
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకముందు చర్లపల్లి గ్రామంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా గడియారం సెంటర్ నుండి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమర్జెన్సీ డే సందర్భంగా ఎమర్జెన్సీ లో పాల్గొన్న వారికి సన్మానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్ కు లేదు అని ఎద్దేవా చేశారు.
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి అందరికీ తెలియాలని ఆర్టికల్-352ను ఇందిరా గాంధీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు. ఎంతో మంది ప్రతిపక్ష నేతలను లక్షల మందిని జైలుకు పంపించారని కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ నేతలను జైళ్లలో వేసి హింసించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు.
విదేశాల్లో దేశం, ప్రధాని మోదీ గురించి అవహేళనగా మాట్లాడటం రాహుల్ అవివేకం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి ఏంటో చూపించా మన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని రైతు భరోసా పేరుతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదన్నారు.
రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా రాలేదని ఫోన్ ట్యాపింగ్ లో బీజేపీ నాయకులందరూ బాధితులే ఫోన్ ట్యాపింగ్ పై ఇంత వరకు ఎందుకు చర్యలు లేవు?. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు.సంచనలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరిస్తూ గత పాలకులు స్వార్థరాజకీయాలకు పాల్పడి, ప్రజా జీవితాలకు భంగం కలిగే విధంగా వ్యవహరించారని విమర్శించారు. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన సూత్రధారులు,పాత్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షుడు జరిగిన ఈ సమావేశంలో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, దాసరి మల్లేష్, శ్రీదేవి రెడ్డి, చింత ముత్యాలరావు, దర్శనం వేణు, పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స..!
-
Teacher : ఉపాధ్యాయులకే ఆమె ఆదర్శం.. ఎందుకో, ఏంటో.. తెలుసుకోవాల్సిందే..!
-
Youth: అప్పు చేసి పప్పు కూడు కు స్వస్తి.. వ్యక్తిగత రుణాలపై ఆసక్తి తగ్గుదల..!
-
Power Cut : రేపు ఆ ప్రాంత ఉప విద్యుత్ కేంద్రంలో విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
-
Gold Price : తగ్గిన బంగారం ధర.. తులం లక్షకు దిగువన.. యుద్ధం వల్లనేనా..!
-
Gold Price : కుప్పకూలిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!









