ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!
మన సాక్షి, మహబూబ్ నగర్ :
రెవెన్యూ కార్యాలయాలు లాంచాలకు మారుపేరుగా మారాయి. ఇటీవల ఏసీబీ అధికారులు కంప్యూటర్ ఆపరేటర్ నుంచి తహసిల్దార్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు కూడా లంచం తీసుకుంటున్న వారిని పట్టుకున్నారు. అయినా కూడా రెవెన్యూ అధికారులు తీరు మారడం లేదు.
మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి ప్రాసెస్ చేసేందుకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. వివరాల ప్రకారం.. కల్యాణ లక్ష్మి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ప్రాసెస్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలసుబ్రమణ్యం ను కోరగా అతను 4000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో శుక్రవారం లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఆర్ ఐ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!
-
Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!
-
Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!









