Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!

Karimnagar : హాస్పిటల్లో చికిత్స పొందుతూ పసికందు మృతి.. హాస్పిటల్ ఎదుట ఆందోళన..!

కరీంనగర్, మనసాక్షి:

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రేవేటు హాస్పిటల్లో శుక్రవారం ఓ పసి కందు మృతి చెందాడు. ఆస్పత్రి ఎదుట పసికందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి గ్రామానికి చెందిన వందన-మహేందర్ దంపతులకు ఈనెల 7వ తేదిన కరీంనగర్ లోని సాన్వి హాస్పిటల్లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే బాబుకి వాంతులు, మోషన్స్ వీరేచనలతో ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నగరంలోని సెవెన్ హిల్స్ వద్ద గల సాయి సింధు హాస్పిటల్లో గత నెల 12న అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు చేయించారు. అయితే బాబుకి పేగులు తిరగబడ్డాయని శస్త్రచికిత్స చేయించాలని వైద్యులు నిర్ధారించారు.

దింతో బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని గత వారం రోజులుగా వైద్యం అందించిన బాబుకి గురువారం సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం బాబుకు బ్లడ్ బ్లీడింగ్ కావడంతో వైద్యులు మళ్ళీ సర్జరీ చేయగా అధిక రక్తస్రావం అవుతూ.. మృతి చెందాడు.

దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెండాని ఆరోపిస్తూ.. హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

MOST READ :

  1. District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ప్రతి క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ కావాలి..!

  2. Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

  3. Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..! 

  4. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

  5. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు