Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రీడలుజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ప్రతి క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ కావాలి..!

District SP : జిల్లా ఎస్పీ కీలక సూచన.. ప్రతి క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ కావాలి..!

జగిత్యాల, (మన సాక్షి)

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పై యువతకు అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ సూచికగా బెలూన్ల ను గాల్లోకి వదిలి టోర్నమెంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎస్పి  మాట్లాడుతూ జిల్లా పోలీసులకు, యువతకు సత్సంబంధాలు మెరుగు పరచాలని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగిందని గడిచిన కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్,  సర్కిల్ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారిని ఈ రోజు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని అన్నారు.

గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించేందుకు అవగాహన పెంచే ఉద్దేశ్యంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతను సరైన మార్గంలో ఉంచాలనే  లక్ష్యంతో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించడం జరిగిందని అన్నారు.యువత తమ ఆలోచనలు సరైన దిశలో వినియోగించుకోవాలని, సామాజిక బాధ్యతతో ముందడుగు వేయాలని సూచించారు.

టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడు యాంటీ డ్రగ్స్ వారియర్ గా పనిచేసి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడంలో కృషి చేయాలని సూచించారు. యువకులు చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఉద్యోగాలు సంపాదించి, తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా యువత చే మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉంటామని అదేవిధంగా తమ చుట్టుపక్కల ఉండే వారికీ  మాధకద్రవ్యాల వినియోగం వాళ్ళ కలిగే అనర్థాల గురించి వివరిస్తామని,జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని  ప్రతిజ్ఞ చేపించారు.

ఈ యొక్క కార్యక్రమం లో  ఎస్బి డిఎస్పీ వెంకటరమణ, సైబర్ క్రైమ్ డిఎస్పీ వెంకటరమణ, జగిత్యాల, మెట్ పల్లి డిఎస్పీ లు రఘు చందర్,రాములు, రిజర్వ్  ఇన్స్పెక్టర్ లు  కిరణ్ కుమార్,వేణు, సైదులు, డీసీఆర్బీ, ఎస్బి, సి సి ఎస్, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్, శ్రీనివాస్ , సి.ఐ లు, అనిల్ కుమార్ సుధాకర్, కరుణాకర్ ,రామ్ నరసింహారెడ్డి, సురేష్ , ఎస్.ఐలు  పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  2. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

మరిన్ని వార్తలు