Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాముకు ఘన సన్మానం..!

Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారి గందె రాముకు ఘన సన్మానం..!
ఎన్నికల్లో సత్తా చాటిన గందె రాము.. పలువురు ప్రశంసలు
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ (2025-27) నూతన పాలకవర్గం ఎన్నికలు సెప్టెంబర్ 28న జరగగా కోశాధికారిగా గందె రాము పోటీ చేసి.. తొలిసారి విజయం సాధించి ఎన్నికలలో రికార్డ్ సృష్టించారు. గందె రాముకు ఉన్న మంచి పేరు, సేవా భావం, పలువురు మిల్లర్లు రాముకు ఓటు వేయడంతో కోశాధికారిగా గెలిచి ప్రత్యేకత చాటారు.
దాంతో మిల్లర్స్ మాజీ అధ్యక్షులు, మిల్లర్స్ అసోసియేషన్ సీనియర్స్ ప్రశంసలు సైతం పొందారు. శుక్రవారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో కోశాధికారిగా గందె రాము ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కాగా రాము ను పలువురు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు.
సన్మానించిన వారిలో రైస్ మిల్లర్లు, బంధువులు గుడుగుంట్ల గణేష్, గార్లపాటి మధు, వనపర్తి సత్యనారాయణ, శ్రీపతి రవి, గరినే రవి, గుండా నాగరాజు, వేముల నగేష్, షీలా శీను, కర్నాటి శరత్, చీదర్ల వెంకటేశ్వర్లు (ఆయిల్ శీను) వెంపటి శంకర్, వంశీ, యాదగిరి, అల్లాని రమేష్, గుండా శశి, గిరి, రమేష్, మోహన్ రావు, శంకర్, పారేపల్లి శ్రీనివాస్, సాయి, చీదెల శ్రీనివాస్, అన్నపురెడ్డిగూడెం గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం.. బాలుడిని కాపాడబోయి ఇద్దరు యువకుల మృతి, బాలుడు గల్లంతు..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Ex Municipal Chairperson : ఛండీహోమం నిర్వహించిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..!
-
Tea Snacks : టీతో ఈ స్నాక్స్ కలిపి తినకూడదు.. కారణం ఏంటంటే..!











