రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..!
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి..!
ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపు ని ప్రారంబించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా, మాడ్గుల ప్రతినిధి, సెప్టెంబర్ 11: మనసాక్షి:
కల్వకుర్తి నియోజక వర్గం మాడ్గుల మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ క్యాంపును సోమవారం కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ల మంజూరు కోసం మండలంలోని వివిగ్రామాలకు చెందిన 18 ఏళ్ళు నిండిన 1650 మంది యువతీ యువకులు ఆధార్ కార్డు, పదవ తరగతి మోమో జిరాక్స్ లని ని నిర్వాకులకి అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని యువతని ప్రోత్సహించేందుకు వారికి ఉచితంగా లెర్నింగ్ లైసెన్స్ లు ఇప్పిస్తున్నామని అన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మరియు పెద్ద గ్రామ పంచాయతీలలో ఈ క్యాంపులని యూత్ కాంగ్రెస్ నాయకులు నిర్వహిస్తారని తెలిపారు.కల్వకుర్తిలో పెద్ద ఎత్తున అప్లికేషన్ లు అందాయని అన్నారు.
ALSO READ :
- Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
- Anganwadi Strike : అంగన్ వాడిల సమ్మె.. కాంగ్రెస్ మద్దతు..!
- మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
- సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
నెల రోజుల పాటు నియోజకవర్గం లో ఈ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ల కోసం క్యాంప్ లు నిర్వహిస్తామని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చెప్పారు. అనంతరం ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల ఉచిత కుట్టుశిక్షణ కేంద్రాన్ని సుంకికిరెడ్డి సందర్శించి కుట్టు శిక్షణ నేర్చుకుంటున్న మహిళలతో మాట్లాడారు.స్థానిక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, మాడ్గుల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దళపతి గౌడ్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి,
వైస్ ప్రెసిడెంట్ గజ్జె సత్యం, ప్రధాన కార్యదర్శి గౌని సురేష్ గౌడ్,గణేష్ గౌడ్,కాట్రాం తండా సర్పంచ్ హంసి రామ్ లాల్, గుడితండా సర్పంచ్ స్వప్న సురేష్,సీనియర్ నాయకులు శ్రీను బావోజీ,శంకర్ నాయక్,
యూత్ అధ్యక్షుడు శివ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు దేవేందర్,మారేపల్లీ శివ, అన్నేపాక శేఖర్, పులికంటి శేఖర్, మహేష్, ప్రసాద్, శేఖర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.









