Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
Civil supply : గోదాములు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు.. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు..!
నల్గొండ జిల్లాలో సివిల్ సప్లై గోదాములను తనిఖీ చేసిన అధికారులు
మిర్యాలగూడ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో యూరియా కొరత ఏర్పడింది. వానాకాలం సీజన్ లో కాల్వకు నీటిని విడుదల చేయకపోయినప్పటికీ బోర్లు , బావుల కింద రైతులు వరి పంటను సాగు చేశారు. అయినా కూడా యూరియా సరిపడా రాకపోవడంతో కొరత ఏర్పడింది.
దాంతో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై మార్క్ ఫెడ్ గోదాములను సివిల్ సప్లై అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం ఇండస్ట్రియల్ ఏరియా లో ఉన్న మార్కుపైడ్ గోదాములను సివిల్ సప్లై జిల్లా అధికారి వెంకటేశ్వర్లు , డిఎం నాగేశ్వరరావు గోదాములను సందర్శించారు.
ALSO READ :
- SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
- Anganwadi Strike : అంగన్ వాడిల సమ్మె.. కాంగ్రెస్ మద్దతు..!
- Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సొసైటీలకు డీలర్లకు సరఫరా చేసిన వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాలం సాగు పనులు చురుకుగా సాగుతున్నాయని రైతులకు అవసరమైన యూరియాను అందించాలన్నారు.
వచ్చిన యూరియాను వచ్చినట్టుగానే డీలర్లు, సొసైటీలకు కేటాయించిన ప్రకారం ఏరోజుకారోజు సరఫరా చేయాలన్నారు. సకాలంలో రైతులకు యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ఎస్ కే జావేద్, ఆర్ ఐ సురేందర్ సింగ్ మార్క్ ఫైడ్ గోదాం సిబ్బంది పాల్గొన్నారు.









