SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
SURYAPET : పేగు బంధాన్ని కంప చెట్లలో పడేసిన కసాయి తల్లి..!
కంప చెట్ల మధ్యన ఒంటరిగా అనాధగా ఏడుస్తున్న ఆడబిడ్డ
అక్కున చేర్చుకున్న అమ్మలు
సూర్యాపేట జిల్లా నెమ్మికల్ లో జరిగిన ఘటన
సూర్యాపేట , మనసాక్షి
కన్నతల్లి ప్రేమను కాలరాసి కన్న పేగు బంధాన్ని కంపచెట్లలో విసిరేసి కసాయి తల్లులు కూడా ఈ సమాజంలో ఉంటారు అని నిరూపించింది కర్కశ కర్కోటక కఠిన కాటున్యం కలిగిన తల్లి అనబడే ఓ హృదయం లేని మూర్ఖురాలు. ఎక్కడ ఏ తప్పు చేసిందో నవ మాసాలు మోసింది.
కని పెంచి అల్లారుముద్దుగా సాదుకోవాల్సిన ముక్కు పచ్చలారని శిశువును ముళ్ళకంపన మధ్యన పడేసి ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా తలదించుకునేలా ప్రవర్తించింది ఒక మనసు లేని మానవత్వం అంతకన్నా లేని మహిళ
ALSO READ :
- మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
- సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
- Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
ఆదరించి తల్లి లేని లోటును తీరుస్తూన్న ఇరుగుపొరుగు అమ్మలు :
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ గ్రామ ఎస్సీ కాలనీలో చర్చి పక్కన సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
అప్పుడే రెపరెపలాడుతూ తెల్ల తెల్లవారుతుండగా ఆ వైపుగా వెళ్లిన కొందరికి పసి బిడ్డ ఏడుపు వినిపించడం వెంటనే అక్కడి చేరుకున్న ఇరుగుపొరుగు వారికి పసి శిశువు కనిపించడం వెంటనే తీసుకువచ్చి చేయాల్సిన పనులన్నీ చేసి ఆ బిడ్డకు కు ఒక్క తల్లి కాదు మేమందరం తల్లులమే అని నిరూపించారు.
మనసు గల మానవత్వం ఉన్న ఆ మహిళ మణులు సహకరించి సాయం అందించిన చేయూత కు మానవత్వం గల మనుషులకు అభినందనలు తెలియజేశారు. ఆ చిన్నారి ని చికిత్స కోసం108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.











