తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : గ్రామాలలో తాగునీటి పనుల మరమ్మతుకు రూ.5.10 కోట్లు విడుదల..!

District collector : గ్రామాలలో తాగునీటి పనుల మరమ్మతుకు రూ.5.10 కోట్లు విడుదల..!

నల్లగొండ, మన సాక్షి :

వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకుగాను, తాగునీటి బోర్లు, చేతిపంపులు, పైపులైన్లు, తాగునీటి ట్యాంకుల మరమ్మతు కు గాను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 827 తాగునీటి పనులు చేపట్టేందుకు డిఎంఎఫ్ టి నిధుల నుండి 5 కోట్ల 10 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నిధులతో గ్రామాలలో తాగునీటి చేతిపంపులతో పాటు, బోర్లను రిపేర్ చేయించాలని, అదేవిధంగా పైపులైన్ల మరమ్మత్తు చేయించడం, సింగిల్ ఫేస్ ,త్రి ఫేస్ మోటార్ల మరమ్మత్తు , ఓహెచ్ఎస్ ఆర్ ల ను మరమ్మతు చేయించాలని ఆమె ఆదేశించారు .

ఈ పనులన్నింటిని సంబంధిత ఎంపీడీవోలు పర్యవేక్షించాలని, పనులు చేపట్టే ముందు పూర్తి అంచనాలు తయారుచేసి ముందస్తు అనుమతి తీసుకొని పనులు ప్రారంభించాలని ఆదేశించారు . పనులు పూర్తయిన తర్వాత ఫోటోలతో సహా బిల్లులు సమర్పించాలని ,గతంలో చేపట్టిన పనులు తిరిగి చేపట్టకూడదని, వేరే పథకాలలో చేపట్టిన పనులు డిఎంఎఫ్ టి నిధుల కింద చేపట్టకూడదని ఆమె స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేశారు.

వేసవి లో తాగునీటి ఎద్దడి ఏర్పడకూడదన్న ఉద్దేశంతో జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో డిఎంఎఫ్టి ద్వారా నిధులు విడుదల చేయడం జరిగిందని, అందువలన ఎక్కడ తాగునీటికి సమస్య రాకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

  2. Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

  3. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు