Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రైతులకు రెండు లక్షలకు పైగా రుణాలు ఉండి మాఫీ కాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. వారికోసం క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకు మూడు విడతలుగా రుణమాఫీ చేసింది. మొత్తంగా 22 లక్షల మంది రైతుల ఖాతాలలో 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసింది. కానీ రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్నవారికి మాఫీ కాలేదు.
ప్రభుత్వం ముందుగా తెలియజేసిన ప్రకారం రెండు లక్షల రూపాయల రుణంకు పైగా ఉన్న రైతులు అదనంగా ఉన్న డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది. కానీ రెండు లక్షల రూపాయలకు పైగా ఋణం ఉన్న రైతులకు ఇప్పటివరకు మాఫీ కాలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయలకు పైగా ఋణం ఉన్న రైతుల విషయంపై తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
2 లక్షల నుంచి రెండు లక్షల 50 వేల వరకు, రెండు లక్షల 50 వేల నుంచి రూ.3 లక్షల వరకు,రూ. 3 లక్షలకు పైగా ఋణం ఉన్న వారి కి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేస్తుందన్నారు. నిబంధనల మేరకు వారు ఏ ఏ తేదీలలో బ్యాంకులలో అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాలో తెలియచేస్తున్నదన్నారు.
రూ. 2 లక్షలకు పైగా ఋణం ఉన్న రైతులు అదనపు అప్పును బ్యాంకులకు చెల్లిస్తే మిగతా రెండు లక్షల రూపాయల రుణంలో ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు అందజేస్తుందన్నారు. ప్రభుత్వ ఇంకా 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేయాల్సి ఉందని, నిధుల సమీకరణ కాగానే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి రెండు లక్షలకు పైగా ఋణం ఉన్న రైతుల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు ఆయన భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారికి సాంకేతిక కారణాలవల్ల వారి వారి ఖాతాలలో డబ్బులు జమకాలేదు. దాంతో వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి రుణమాఫీ యాప్ లో కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అప్లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత వారం రోజుల్లో వారి ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.
LATEST UPDATE :
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!










