Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్టిఏ అధికారి..!
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్టిఏ అధికారి..!
జగిత్యాల, (మన సాక్షి )
జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి కల్లోలంగా బయటపడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీఏ అధికారి బద్రు నాయక్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక వ్యక్తి నుంచి రూ. 22,000 లంచం స్వీకరించినట్లు నిర్థారణ అయింది.
ఈ వ్యవహారాన్ని గమనించిన అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు, సమాచారం మేరకు అప్రమత్తమై బుధవారం దాడులు నిర్వహించారు. లంచం మొత్తం ఆయన పర్సనల్ డ్రైవర్ ద్వారా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాక్ష్యాలతో బద్రు నాయక్‌ను ప్రశ్నించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది ప్రజలు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల కోసం వరుసలో నిలబడే వారు అధికారుల అవినీతి మాయాజాలంలో చిక్కుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
Nalgonda : రూ.500 నోటు.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్ కు కారణం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దు..!
-
Nalgonda : అత్యంత ఆధునిక సౌకర్యాలతో నల్గొండ జిల్లా కేంద్రంలో 13 కోట్లతో ఇందిరా భవన్ నిర్మాణం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!









