మిర్యాలగూడ : నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు

మిర్యాలగూడ : నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు

మిర్యాలగూడ, మనసాక్షి

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు పాఠశాలలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ హెచ్చరించారు.

 

విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుండి కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని అట్టి పాఠశాలలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.

 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అన్ని పాఠశాలలకు పంపించామని, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పట్టణంలో కొన్ని విక్రయశాలలను అనుమతించామని ప్రభుత్వంచే అనుమతి పొందిన విక్రయ దుకాణాలలోనే పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు తెలిపారు.

 

జూన్ 12 నుండి మాత్రమే తరగతులు నిర్వహించాలని ఈలోపు విద్యార్థులతో తరగతులు నిర్వహించినట్లయిచే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

ప్రైవేట్ పాఠశాలల్లో తీర్మానాల మేరకు తరగతి వారిగా ఫీజుల వివరాలు నిర్ధారించాలని వాటిని నోటీసు బోర్డుపై ఉంచాలని తెలిపారు.