TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నది. ఈనెల 26వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి రైతులకు పెట్టుబడి సహాయం అందించడమే ఈ రైతు భరోసా ప్రధాన ఉద్దేశం.

రైతు భరోసా పథకానికి అర్హతలను నిర్ణయించేందుకుగాను ప్రభుత్వం జీవో ఆర్ టీ నెంబర్ 18 ని విడుదల చేసింది. అయితే జీవో ప్రకారం 2025 జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధి మరియు ఆహార భద్రత కూడా తోడ్పడుతుంది. దీంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

రైతు భరోసాలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..

👉 రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయలను పెంచబడింది.

👉 భూభారతి పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు.

👉 ఇందులో వ్యవసాయ యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుండి తొలగిస్తారు.

👉 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసా కు అర్హులు.

👉 RBI నిర్వహించే డిపిటి పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతు ఖాతాలో జమ చేస్తారు.

👉 రైతు భరోసా పథకాన్ని వ్యవసాయ శాఖ సంచాలకులు అమలు చేస్తారు.

👉 జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలో ఈ పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం బాధ్యులుగా ఉంటారు.

MOST READ : 

మరిన్ని వార్తలు