TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండరాజకీయం

Municipal Elections : అప్పుడే మున్సిపల్ ఎన్నికల హడావుడి.. మిర్యాలగూడలో అధికార పార్టీ నుంచి వలసలు..!

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా రాజకీయ పార్టీలలో హడావుడి నెలకొన్నది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా విజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగించేందుకు సిద్ధమైంది.

Municipal Elections : అప్పుడే మున్సిపల్ ఎన్నికల హడావుడి.. మిర్యాలగూడలో అధికార పార్టీ నుంచి వలసలు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా రాజకీయ పార్టీలలో హడావుడి నెలకొన్నది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా విజయం సాధించడంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే ఊపు కొనసాగించేందుకు సిద్ధమైంది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో 36 గ్రామపంచాయతీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మరో కొన్ని గ్రామపంచాయతీలో అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయింది. ఇది ఇలా ఉండగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందుకుగాను అధికార పార్టీ నాయకులను, కార్యకర్తలను బిఆర్ఎస్ లో చేర్చుకుంటుంది.

అధికార పార్టీలో తమకు కౌన్సిలర్ టికెట్లు రాదని భావించిన వారు ప్రతిపక్ష బీఆర్ఎస్ లోకి వలసలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ పట్టణంలోని 47వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు 200 మందితో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు.

ఇదిలా ఉండగా మున్సిపల్ ఎన్నికలు మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎలా ఉండబోతాయనే విషయంపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నుంచి వలసలు వెళ్లడంతో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయం వచ్చే నాటికి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయని వేచి చూడాల్సి ఉంది.

MOST READ 

మరిన్ని వార్తలు