తెలంగాణBreaking NewsTOP STORIESవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఖాతాలలో జమ ఎప్పుడంటే..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని యాసంగి నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో రైతు ఉత్సవాల సందర్భంగా ఆయన పాల్గొని రైతు భరోసా యాసంగి విడత ప్రకటించారు.

Rythu Bharosa : రైతు భరోసా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఖాతాలలో జమ ఎప్పుడంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా పథకాన్ని యాసంగి నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో రైతు ఉత్సవాల సందర్భంగా ఆయన పాల్గొని రైతు భరోసా యాసంగి విడత ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది రైతులకు 9000 కోట్ల రూపాయలను మూడు విడతలుగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

తొలివిడతలో ఎకరం భూమి ఉన్న 24.32 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి సహాయంగా 3590 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఆర్.బి.ఐ ద్వారా బ్యాంకులకు బదిలీ చేయనున్నది. ఆ తర్వాత మరో 20 రోజుల వ్యవధిలో రెండో విడత 2650 కోట్ల రూపాయలు, మూడవ విడతలో 2760 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నది. కాగా తొలి విడత నిధులను ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఈరోజు ఆదివారం సెలవు కావడం వల్ల సోమవారం ఆర్బిఐ బ్యాంకులకు బదిలీ చేయనున్నది. సోమవారం నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.

మరిన్ని వార్తలు