TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం యాసంగి సీజన్ లో త్వరలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. యాసంగి సీజన్ లో రైతు భరోసా ఇప్పటివరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయకపోవడం వల్ల రైతులు ఎదురుచూస్తున్నారు. 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం యాసంగి సీజన్ లో త్వరలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి. యాసంగి సీజన్ లో రైతు భరోసా ఇప్పటివరకు రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయకపోవడం వల్ల రైతులు ఎదురుచూస్తున్నారు. 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా ఏడాదికి రెండు విడుదలగా రైతులకు ఎకరానికి 12 వేల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేయనున్నారు. కాగా వానకాలం సీజన్ లో పంటల సీజన్ కు ముందే రైతుల ఖాతాలలో ఒక విడత ఎకరానికి 6000 రూపాయలను జమ చేశారు. కాగా రెండవ విడత యాసంగి సీజన్ లో ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయాల్సి ఉంది.

కానీ పంటల సీజన్ పూర్తయి రెండు మాసాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం అందజేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజా పాలన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే రైతు భరోసా పథకం రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. 9000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో 9 రోజుల్లో జమ చేస్తామని చెప్పారు. అందుకు గాను ఈనెల 16వ తేదీన మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కాగా 17 లేదా 18వ తేదీలలో రైతుల ఖాతాలలో రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు ఖాతాలలో జమ కానున్నాయి.

రైతులకు రైతు భరోసా పథకం ద్వారా అందజేసే డబ్బులు వృధా కాకుండా ఉండేందుకుగాను పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కోసం శాటిలైట్ సర్వేను చేపట్టింది. శాటిలైట్ సర్వే ఆధారంగా రైతులకు ఖాతాలలో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. శాటిలైట్ సర్వే ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే 10% రైతులు కట్ అయ్యే అవకాశం ఉంది.

దాంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఎన్నికల్లో రైతు భరోసాలో కోత నిర్వహిస్తే ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం. దాంతో ఎలాంటి కోతలు లేకుండా గతంలో మాదిరిగానే ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని అందజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నాలుగు, ఐదు రోజుల్లో రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమకానున్నాయి.

MOST READ 

  1. TG News: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఏ మునిసిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందో తెలుసుకుందాం..!
  2. WhatsApp : వాట్సాప్ పై నిషేధం..?
  3. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 విజయం..!
  4. Nalgonda : ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు